ఆరెస్సెస్ బోధనల వల్లే ‘సర్జికల్’

18 Oct, 2016 02:02 IST|Sakshi
ఆరెస్సెస్ బోధనల వల్లే ‘సర్జికల్’

పరీకర్ వ్యాఖ్య
అహ్మదాబాద్:  పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేయాలనే ఆలోచన బహుశా తమకు ఆరెస్సెస్ బోధనల వల్లే వచ్చి ఉండొచ్చని రక్షణ  మంత్రి మనోహర్ పరీకర్ సోమవారం అన్నారు. మహాత్మాగాంధీ పుట్టిన గుజరాత్ నుంచి వచ్చిన ప్రధాని మోదీ, సైనిక బలగాల చరిత్రలేని గోవా నుంచి వచ్చిన తాను కలసి ఈ దాడులకు ఆదేశాలివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  అహ్మదాబాద్‌లోని నిర్మా వర్సిటీ నిర్వహించిన ‘నో మై ఆర్మీ’(నా సైన్యం గురించి తెలుసుకో) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘కొంతమంది ఈ దాడులకు సాక్ష్యాలు అడుగుతున్నారు. ఆర్మీ చెబితే నమ్మాలి. సాక్ష్యాలు ఇచ్చాకా నమ్మని వారు కొందరుంటారు. రుజువులు కోరే వారిని పట్టించుకోనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యం మనకుంది’ అని అన్నారు.  ఐదారేళ్లలో సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ చాలామార్లు ఉల్లంఘించిందని, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ప్రస్తుతం మనం వారికి తగిన విధంగా (కాల్పులు, దాడులతో) సమాధానమిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు