ఎమ్మెల్యేల జీతాలు పెంచుతారు కానీ..

10 Jan, 2018 13:07 IST|Sakshi

ఏడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

డిపోలకే పరిమితమైన బస్సులు

సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఏడో రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించనిదే సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన కార్మికులు ఆందోళనను ఉద్రితం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సమ్మె విరమణకు సిద్ధమని మంగళవారం కార్మిక సంఘాలు ప్రకటించాయి.

అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పళనిస్వామి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల వేతనాలు పెంచుకుంటారు కానీ.. తమ వేతనాలు గురించి పట్టించుకోరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక‍్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు