ఆ హక్కు ప్రభుత్వానికి ఉందా?

23 Oct, 2019 03:09 IST|Sakshi

సామాజిక మాధ్యమాల్లోని సమాచారం వెల్లడించడంపై విచారించనున్న సుప్రీం

‘సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌కు ఆధార్‌ లింక్‌’ పిటిషన్లన్నీ ఇక సుప్రీంకోర్టుకే

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోని పౌరుల సమాచారాన్ని తెలుసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే కీలక అంశంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అదేవిధంగా, సామాజిక మాధ్యమాలకు ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించడంపైనా విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించి వేర్వేరు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తానుగా బదిలీ చేసుకుంది. ఈ అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం.. సోషల్‌ మీడియా దురి్వనియోగాన్ని అడ్డుకట్టవేసేందుకు, మెసేజీలను డీక్రిప్ట్‌ చేసే బాధ్యతను ఇంటర్మీడియరీస్‌ (ఇంటర్నెట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్లు, సెర్చ్‌ ఇంజిన్లు, సామాజిక మాధ్యమాల వేదికలు)దే అనడంలో విశ్వసనీయతపై జనవరి 15వ తేదీలోగా నివేదిక సమరి్పంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంటరీ్మడియరీస్‌ గైడ్‌లైన్స్‌(సవరణ) చట్టం–2018 రూపకల్పనకు 90 రోజుల గడువు కావాలంటూ కేంద్రం చేసిన వినతిపై ఈ మేరకు సానుకూలత వ్యక్తం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఇది జాతి సమగ్రత, దేశ భద్రత పరిరక్షణకు మాత్రమే ఈ వెసులుబాటు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందంటూ ఒక ఉగ్రవాది వాదించలేడని ఈ సందర్భంగా అటార్నీ జనరల్‌ పేర్కొన్నారు. ఒక మెసేజి గానీ, సమాచారం గానీ వాస్తవంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఇంటరీ్మడియరీస్‌ బహిర్గతం చేయడం తప్పనిసరి చేసేందుకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు కేంద్రం ప్రయతి్నస్తోందన్న వాదనను సొలిసిటర్‌ జనరల్‌ తోసిపుచ్చారు.

తమిళనాడు తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ హాజరై..వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లోని అధికారులు కోరిన ఏదైనా సమాచారాన్ని వెల్లడించాల్సిందేనంటూ ఐటీ చట్టంలోని సెక్షన్‌–69 చెబుతోందని, ఇందుకు విరుద్ధంగా చేస్తున్న వాదనలు భారతీయ చట్టాల ప్రకారం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ‘అయితే, ఈ విషయంలో వారిని బలవంతం చేయగలమా? ఆ సమాచారాన్ని డీక్రిప్ట్‌ చేసి ఇవ్వడం లేదా అందుకు అవసరమైన సాంకేతికతను మీకు అందించడం ఇంటరీ్మడియరీస్‌ది బాధ్యత అయి ఉండాలి’అంటూ ధర్మాసనం స్పందించింది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం కోరిక మేరకు.. సుప్రీంకోర్టుకు పెండిం గ్‌ పిటిషన్ల బదిలీని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు.

దీంతో దాదాపు ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో రెండు, బోంబే, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్‌ చేసిన వినతిని కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను 2020 జనవరి చివర్లో తగు ధర్మాసనం విచారణ చేపట్టేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఏదైనా నేర విచారణకు సంబంధించి అధికారులు కోరిన సమాచారాన్ని సరీ్వస్‌ ప్రొవైడర్లు అందించాలా వద్దా అనేది సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయించాలని ఫేస్‌బుక్‌ తన పిటిషన్‌లో కోరింది.  

మరిన్ని వార్తలు