శబరిమలకు పోటెత్తిన భక్తులు

18 Nov, 2018 06:04 IST|Sakshi

పంబ/సన్నిధానమ్‌: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయా నికి శనివారం భక్తులు పోటెత్తా రు. పలువురు నేతలు శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపుని చ్చినప్పటికీ భక్తుల సంఖ్య తగ్గలేదు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య శుక్రవారం ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. నిషేధిత సమయంలో ఆలయ పరిసరాల్లో ఉన్నారనే కారణంతో ‘ఐక్యవేది’ రాష్ట్ర అధ్యక్షురాలు కేపీ శశికళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలియగానే ఐక్యవేది నేతలు 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. చెదురుమదురు ఘటనలు మినహా బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. కాగా, అన్ని వయస్సుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చన్న తీర్పుపై గడువు కోరేందుకు సోమవారం (19న) సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు