ఫూల్స్‌ డేను ఇలా జరిపారు..

1 Apr, 2018 12:42 IST|Sakshi
పంజాబ్‌ సీఎం పేరిట డమ్మీ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన అకాలీదళ్‌ కార్యకర్తలు

సాక్షి, న్యూఢిల్లీ : ఫూల్స్‌ డేను రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు వేదికగా చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు ట్వీట్‌లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడగా..పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని గుర్తుచేస్తూ శిరోమణి అకాలీ దళ్‌ (ఎస్‌ఏడీ) కార్యకర్తలు ఆదివారం ప్రజలకు డమ్మీ స్మార్ట్‌ ఫోన్లు, నగదు పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేస్తామని అమరీందర్‌ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా, హింస, అశ్లీలం, అభ్యంతరకర మెసేజ్‌లకు చెక్‌ పెట్టేందుకు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలో నవజోత్‌ సింగ్‌ సిద్ధూ వైస్‌ ఛైర్మన్‌గా ప్రభుత్వం కల్చరల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఎస్‌ఏడీ వినూత్న నిరసనతో ముందుకురావడం గమనార్హం. ఈ కల్చరల్‌ కమిషన్‌కు ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టే అధికారాలు కల్పించారు.

మరిన్ని వార్తలు