నేను జయలలిత చెల్లిని..

4 Jul, 2014 02:57 IST|Sakshi
నేను జయలలిత చెల్లిని..

 టీడీ ఛానెల్ ఇంటర్వ్యూలో శైలజ

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన అక్కని చెబుతూ సుమారు 60 ఏళ్ల శైలజ గురువారం బెంగళూరులో ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. తానెలా నిరాదరణకు గురైంది చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శైలజ చెబుతున్న ప్రకారం..‘అలనాటి నటి సంధ్యారాణి, జయరామన్ దంపతులకు ముగ్గురు సంతానం.

జయలలిత పెద్ద కుమార్తె కాగా, నేను, జయకుమార్ మిగిలిన బిడ్డలం. నేను మూడో నెల గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. నన్ను అప్పటి ప్రఖ్యాత కళాకారుడు దామోదర్ పిళైకి దత్తత ఇచ్చారు. సంధ్యారాణి అసలు పేరు వేదమ్మ. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా.  నేను బెంగళూరులో ఉన్న విషయం అక్కకు తెలుసు. ఆమె అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటే, నేను పేదరికంలో మగ్గుతున్నాను’

మరిన్ని వార్తలు