సహాయానికి సాక్షి పిలుపు

18 Aug, 2018 22:42 IST|Sakshi
కేరళ వరదలు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రకృతి విలయంతో చిద్రమైన కేరళను కష్టాల కడలి నుంచి గట్టెక్కించే మానవతా కృషి జరగాలిప్పుడు. ఎవరిస్థాయిలో వారు ఆర్థిక సహాయం అందించడానికి మానవతా దృక్పథంతో ముందుకు రావాలని ‘సాక్షి మీడియా సంస్థ’ పిలుపునిస్తోంది. సాటి మనుషుల కష్టం మన కష్టంగా భావించి తోచిన సహాయం అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలే కాక దేశంలోని పలు రాష్ట్రప్రభుత్వాలు, కంపెనీలు, కార్పోరేట్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు ఉదారంగా ముందుకు వచ్చి తమకు తోచిన, చేతనైన సహాయాన్ని ఇప్పటికే అందిస్తున్నాయి. కొందరు ఆర్థికసహాయం చేస్తుంటే, మరికొందరు ఇతరేతర రూపాల్లో సహాయం అందిస్తున్నారు. మనమెక్కడున్నా, సాటి మనుషులకు వచ్చిన ఈ కష్టాన్ని చూస్తూ ఉండలేం! మనలోనూ ఎందరెందరో వితరణశీలురు, ఉదారస్వభావులూ చేతనైన సహాయం చేయడానికి సిద్దపడుతున్నారు. పడాలి కూడా! దేవభూమిగా పేరొంది, దేశ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానమైన కేరళ ఈ రోజున్న విపత్తు నుంచి గట్టెక్కాలని సాక్షి అభిలషిస్తోంది.

వరద బాధితులకు సాయం చేయాలంటే ఇలా ..
కేరళ ప్రభుత్వం కూడా  సాయం చేయాలంటూ ట్విట్టర్‌ ద్వారా అభ్యర్థిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను పంపించవచ్చు.  
అకౌంట్‌ నెంబర్‌ : 67319948232
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
తిరువనంతపురం శాఖ
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ : ఎస్‌బిఐఎన్‌  SBIN 0070028
పాన్‌ : AAAGDO0584M
స్విఫ్ట్‌ కోడ్‌ :    SBININBBT08

ఇక అమెజాన్, పేటీఎంలు కూడా విరాళాలు సేకరించి సీఎం సహాయ నిధికి అందిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కూడా విరాళాలు సేకరిస్తోంది. 

మరిన్ని వార్తలు