టాయిలెట్లు లేవు... టీచర్ల జీతాలు కట్

14 Feb, 2015 13:57 IST|Sakshi
టాయిలెట్లు లేవు... టీచర్ల జీతాలు కట్

భోపాల్: పాఠశాలలో టాయిలెట్లు నిర్మించలేదని టీచర్లకు జీతాలు నిలిపివేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని షాడోల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ బార్గవ శనివారం జిల్లాలోని వివిధ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్బంగా సర్వ శిక్ష అభియాన్ పధకం కింద సదరు టాయిలెట్లు నిర్మించలేదని ఆయన పరిశీలనలో తెలింది.

నిధులు ఇచ్చిన ఎందుకు టాయిలెట్లు నిర్మించలేదని సదరు పాఠశాల ప్రభుత్వ టీచర్లపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించరా అంటూ తన నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు టీచర్ల జీతాలు నిలిపివేయాలని హుకుం జారీ చేశారు. దీంతో జిల్లాలోని షోహాగ్పూర్ బ్లాక్లో 10 మంది, గోపారు బ్లాక్లో 4, బుదార్లో 3, బెవ్హరి 2, జైసింగ్నగర్ 6 టీచర్ల జీతాలు ఆపేశారు.

మరిన్ని వార్తలు