శిక్ష సస్పెన్షన్ తరువాత సల్మాన్ స్పందన

9 May, 2015 02:50 IST|Sakshi
కుటుంబ సభ్యులతో సల్మాన్ ఖాన్

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో  ఐదేళ్ల  జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు  చెప్పిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసిన అనంతరం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మొదటిసారిగా స్పందించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు, బాలీవుడ్ తారలందరికీ సల్మాన్‌ఖాన్ కతజ్ఞతలు తెలిపారు.

''నా కోసం ప్రార్థనలు జరిపిన వారికి, మద్దతుగా నిలిచిన వారికి మెహర్బానీ, షుక్రియా'' అని  ట్వీట్ చేశారు.  బాంబే హైకోర్టు సల్మాన్కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ అభిమానులు సబర్బన్ బంద్రాలోని ఆయన ఇంటి వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు