ప్రతీకార దాడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు

22 Mar, 2019 10:51 IST|Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ దాడులను ఎన్నికల జిమ్ముక్కుగా విమర్శిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శామ్‌ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై దాడులు చేయడం మంచి పద్దతి కాదన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ.. ‘ఈ దాడుల గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ ఇలాంటి దాడులు గతంలో జరిగాయి. ముంబైలో కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి దాడులు జరిగిన వెంటనే ప్రతీకారంగా మనం మన విమానలను పాకిస్తానపై దాడులకు పంపడం చేస్తాం. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్‌పై దాడి చేయడం మంచి పద్దతి కాదు. ఇలాంటి దాడులు చేసే వారు ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తారో నాకు అర్థం కావడం లేద’ని తెలిపారు.

ఈ సందర్భంగా ముంబై దాడులను గుర్తు చేసుకుంటూ.. ‘ఓ 8 మంది వచ్చి మన దేశంలో దాడులు చేసి వెళ్లారు. ఈ చర్యలకు ఆ దేశాన్ని మొత్తం నిందించడం సరికాదు. ప్రతీకార దాడులను నేను నమ్మన’ని స్పష్టం చేశారు. (‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్‌)

మరిన్ని వార్తలు