ఆసుప‌త్రిలో చేరిన ములాయం సింగ్

8 May, 2020 08:43 IST|Sakshi

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయంసింగ్ యాద‌వ్‌  అనారోగ్యానికి గుర‌య్యారు. కుడుపు నొప్పి కార‌ణంగా తీవ్ర అస్వస్థతకు లోన‌య్యారు. దీంతో వెంట‌నే ఆయ‌న్ని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. 80 ఏళ్ల ములాయం సింగ్ క‌డుపునొప్పి, మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని పార్టీ అధికార ప్ర‌తినిధి రాజేంద్ర చౌద‌రి తెలిపారు.

ములాయం సింగ్ కుమారుడు, ఎస్పీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్, ఇత‌ర కుటుంబ స‌భ్యులు గురువారం ఆయ‌న్ని చూడ‌టానికి హాస్పిట‌ల్‌కి వెళ్లారని రాజేంద్ర చౌద‌రి తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామ‌నేది సాయంత్రంలోగా వెల్లడిస్తామని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు