శానిటైజ‌ర్ వ‌ల్ల ఆ ప్ర‌మాదం లేదు

2 Jun, 2020 18:35 IST|Sakshi

న్యూఢిల్లీ: శానిటైజ‌ర్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మ‌హా న‌గ‌రం నుంచి మారుమూల ప‌ల్లె వ‌ర‌కు ఇది వాడ‌ని వారే లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. ఏదైనా ప‌ని చేసేముందు, చేసిన త‌ర్వాత, వ‌స్తువుల‌ను వాడే ముందు, వాడిన త‌ర్వాత ఇలా ప‌దేప‌దే వాడుతూ దాన్ని ఓ నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మార్చివేశాం. అయితే ఈ మ‌ధ్య శానిటైజ‌ర్ ప్ర‌మాదమంటూ కొన్ని ర‌కాల వార్త‌లు వెలువ‌డ్డాయి. ముఖ్యంగా 50 నుంచి 60 రోజుల పాటు అదే ప‌నిగా శానిటైజ‌ర్ వాడితే చ‌ర్మ వ్యాధుల‌తో పాటు క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఓ వార్తా సంస్థ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. (పదే పదే శానిటైజర్‌ వాడుతున్నారా?)

పైగా దీనికి బ‌దులుగా స‌బ్బు వాడ‌టం ఉత్త‌మ‌మంటూ ఓ ఉపాయాన్ని కూడా సెల‌విచ్చింది. దీనిపై ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) మండిప‌డింది. అది పూర్తి అస‌త్య వార్త‌గా కొట్టిపారేసింది. శానిటైజ‌ర్లు ప్ర‌జ‌ల‌కు హాని చేయ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు 70 శాతం ఆల్క‌హాల్ ఉన్న హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను వాడ‌టం ఉత్త‌మ‌మ‌ని సూచించింది. కాబ‌ట్టి భ‌యాలు వీడి నిశ్చింత‌గా శానిటైజ‌ర్లు వాడండి, కోవిడ్‌ను త‌రిమి కొట్టండి. (పూర్తి ఆటోమేటెడ్‌ శానిటైజేషన్‌ డిస్పెన్సర్‌)

>
మరిన్ని వార్తలు