‘అక్కడ మందిర్‌..ఇక్కడ సర్కార్‌’

9 Nov, 2019 14:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించిన క్రమంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటిగా మందిర్‌..తర్వాత ప్రభుత్వం..అయోధ్యలో ఆలయం మహారాష్ట్రలో ప్రభుత్వం అంటూ ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో అధికార పంపకంపై బీజేపీ, శివసేనల మధ్య నెలకొన్న సంవాదంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. చెరి రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాలన్న శివసేన ప్రతిపాదనకు బీజేపీ ససేమిరా అనడంతో ఇరు పార్టీలూ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. శివసేనకు సహకరిస్తామని ఎన్సీపీ సంకేతాలు పంపినా కాంగ్రెస్‌ పార్టీ విముఖతతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. మరోవైపు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చొరవచూపడం లేదు. ఇక ప్రస్తుత అసెంబ్లీకి శనివారంతో గడువు తీరడంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా