సీబీఐ విచారణకు హాజరైన రాజీవ్‌ కుమార్‌ 

9 Feb, 2019 12:10 IST|Sakshi

షిల్లాంగ్‌ : కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్ శనివారం సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శారదా చిట్‌ఫండ్‌, రోజ్ వ్యాలీ కుంభకోణం కేసులో రాజీవ్‌ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే  షిల్లాంగ్‌ చేరుకున్నారు. షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో రాజీవ్ కుమార్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.  కాగా ఈ శారదా చిట్‌ఫండ్‌ కేసులో రాజీవ్ కుమార్‌ నివాసంలో సోదాలకు వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడం, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

మరోవైపు తమ దర్యాప్తుకు రాజీవ్‌ కుమార్‌ సహకరించడం లేదని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో 1989 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్‌ సీబీఐ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్‌ ఘోష్‌ను కూడా ఆదివారం షిల్లాంగ్‌లో జరిగే విచారణకు హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు