సరోద్‌ పండితుడు దాస్‌గుప్తా కన్నుమూత

15 Jan, 2018 17:09 IST|Sakshi

కోల్‌కతా: సరోద్‌ పండితుడు బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా(84) దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత అయిన ఆయన కొద్ది రోజులుగా శ్వాససంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దాస్‌గుప్తా మృతి ఆ రంగానికి తీరని లోటని పేర్కొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1933లో బీహార్‌ రాష్ట్రంలోని భాగల్పూరు ఆస్పత్రిలో జన్మించారు. పండిట్‌ రాధికా మోహన్‌ మోయిత్రా వద్ద సరోద్‌ నేర్చుకున్నారు. 2015లో సంగీత్‌ మహాసమ్మాన్‌, బంగాబిభూషణ్‌ బిరుదులు పొందారు. ఆయన తండ్రి ప్రఫుల్ల మోహన్‌ దాస్‌గుప్తా జిల్లా మేజిస్ట్రేట్‌ మాత్రమేగాక సంగీతంలో ప్రజ్ఞాశాలి. బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా చిన్న కుమారుడు యూ.ఎస్‌ నుంచి వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు