కేరళ గవర్నర్గా సదాశివం ప్రమాణ స్వీకారం

5 Sep, 2014 10:52 IST|Sakshi
కేరళ గవర్నర్గా సదాశివం ప్రమాణ స్వీకారం

తిరువనంతపురం: కేరళ గవర్నర్గా పి.సదాశివం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్భవన్లో జరిగిన
ప్రత్యేక కార్యక్రమంలో పి.సదాశివం చేత కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్, కేరళ అసెంబ్లీ స్పీకర్ జి.కార్తీకేయన్లు హాజరయ్యారు.

అయితే కేరళ గవర్నర్గా యూపీఏ హాయాంలో నియమితులైన షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో... బీజేపీ ప్రభుత్వం పి.సదాశివంను ఆ పదవిలో నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన సదాశివం ఈ ఏడాది ఏప్రిల్లో పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు