దేశంలో తొలి హిజ్రా న్యాయవాది

1 Jul, 2018 03:22 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిజ్రాకు బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం లభించింది. 36 ఏళ్ల సత్యశ్రీ శనివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న 11 ఏళ్ల తర్వాత బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం పొందగలిగానని ఈ సందర్భంగా సత్య శ్రీ ఆవేదన చెందారు. జడ్జిగా ఎదగడమే తన కల అని చెప్పారు.

రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ జన్మతః బాలుడు. చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి వచ్చి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు. 2007లో సేలం కేంద్రీయ లా కాలేజీ నుంచి లా పట్టా తీసుకున్నారు. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రాతిపదికన జాతీయ న్యాయ వ్యవహారాల కమిషన్‌ హిజ్రాలు సైతం లాయర్లుగా బార్‌ కౌన్సిల్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో సత్యశ్రీకి బార్‌ కౌన్సిల్‌ సభ్యత్వం లభించింది.

మరిన్ని వార్తలు