‘ఫోన్‌ల కంటే ప్రాణాలే ముఖ్యం’

26 Aug, 2019 08:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కమ్యూనికేషన్‌ వ్యవస్ధ స్థంభించడంపై వ్యాఖ్యానిస్తూ టెలిఫోన్‌లు లేకున్నా పరవాలేదని ప్రాణ నష్టం సంభవించకూడదనేదే తమ విధానమని స్పష్టం చేశారు. గతంలో కశ్మీర్‌లో సంక్షోభాలు నెలకొన్న సందర్భాల్లో తొలివారంలోనే కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న నిరసనల్లో జమ్ము కశ్మీర్‌లో ఏ ఒక్కరూ మరణించలేదని కేవలం చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కమ్యూనికేషన్‌ వ్యవస్థను అతిత్వరలో పునరుద్ధరిస్తామని వెల్లడించారు. మూడు వారాలు గడిచినా కశ్మీర్‌ లోయలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఫోన్‌ కనెక్టివిటీ అందుబాటులో లేదు. నిషేధాజ్ఞలు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుండగా పలు చోట్ల స్కూళ్లు ఇంకా తెరుచుకోకపోవడం విశేషం

మరిన్ని వార్తలు