బెంగాల్‌ను ఆదుకోండి: మమత

10 Mar, 2015 02:28 IST|Sakshi
బెంగాల్‌ను ఆదుకోండి: మమత

న్యూఢిల్లీ: ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పశ్చిమబెంగాల్‌ను ఆదుకోవాలని ప్రధానిమోదీకి ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ రుణ భారాన్ని తగ్గించాలని కోరారు. సోమవారం ఆమె పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీతో భేటీ అయ్యారు. తృణమూల్, బీజేపీ సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీదీ చాలా సార్లు విమర్శించారు కూడా. అయితే సోమవారం మమత పార్లమెంటులో మోదీని కలిశారు. అనంతరం ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందంతో కలసి వెళ్లి సమావేశమయ్యారు.

రుణాల ఊబిలో కూరుకుపోయిన బెంగాల్‌ను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పలు పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మోదీ.. బెంగాల్ రాష్ట్రాన్ని వీలైనంతగా ఆదుకుంటామని, అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ అప్పులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగుందని పేర్కొన్నారు. అయితే రుణ భారాన్ని తగ్గించడంపై ప్రధాని ఎలాంటీ హామీ ఇవ్వలేదు. భేటీ అనంతరం మమత విలేకరులతో మాట్లాడారు. ‘వీలైనంత మేర సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు