‘గొంతుకు చీర బిగించి ఈడ్చుకెళ్తుంటే చూశాను’

28 Jun, 2017 15:35 IST|Sakshi
‘గొంతుకు చీర బిగించి ఈడ్చుకెళ్తుంటే చూశాను’

ముంబయి: ముంబయిలోని బైకుల్లా జైలులో చోటు చేసుకున్న దారుణాన్ని బుధవారం ఇంద్రాణి ముఖర్జియా కోర్టుకు వివరించారు. జైలు అధికారులు మంజులా షెట్యి అనే ఖైదీపట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించారో వెల్లడించారు. కోడిగుడ్లు దొంగిలించిందనే కారణంతో మంజులా అనే ఖైదీని ఆ జైలు సూపరింటెండెంట్‌ చాలా దారుణంగా కొట్టడమే కాకుండా బ్యాటన్‌తో లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె చనిపోవడంతో జైలులో పెద్ద ఆందోళన మొదలైంది.

ఈ క్రమంలోనే ఇంద్రాణిపై కూడా జైలు అధికారులు దాడి చేసినట్లు ఆమె తరుపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆమెను కోర్టులో హాజరుపరచాల్సిందిగా బైకుల్లా జైలు అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టులో హాజరైన ఇంద్రాణి ‘మా పక్క సెల్‌లోనే ఉంటున్న మంజుల గొంతుకు చీరను చుట్టేసి జైలు సూపరింటెండెంట్‌ అధికారిణి బయటకు ఈడ్చేసుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాన్ని నేను నా సహచర ఖైదీలం సెల్‌ తలుపు రంధ్రంలో నుంచి చూశాం. ఈ విషయం నేను ఎవరితోనైనా చెబితే నాకు అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. బాధితురాలపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తుంటే నేను కళ్లారా చూశాను’ అని వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం తన కూతురు షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు