29న అయోధ్యపై విచారణ రద్దు

28 Jan, 2019 04:03 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉండగా, వారిలో ఒకరైన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండరనీ, కాబట్టి కేసు విచారణను ఆ రోజున రద్దు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు రిజస్ట్రీ ఓ నోటీసు విడుదల చేసింది. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తుండగా, జస్టిస్‌ బాబ్డేతోపాటు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనాన్ని ఈ నెల 25న ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో పాలుపంచుకునేందుకు జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ ఎన్వీ రమణలు విముఖత చూపారు. వారి స్థానంలో జస్టిస్‌ భూషణ్, జస్టిస్‌ నజీర్‌లు ధర్మాసనంలో చేరారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు