‘హిందీ తప్పనిసరి’పై సుప్రీంలో చుక్కెదురు

5 May, 2017 01:14 IST|Sakshi

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకూ హిందీని తప్పనిసరిచేస్తూ కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ వేసిన ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మీరే ఆ పని ఎందుకు చేయకూడదు? ఎలాగూ మీ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి మీరు కూడా ప్రభుత్వంలో భాగమే కదా.. అని ప్రశ్నించారు. ధర్మాసనంలోని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ స్పందిస్తూ.. ఇతర భాషలు మాట్లాడే ప్రజలు కూడా హిందీ తప్పనిసరి నిబంధనను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కేంద్రం తరఫున వేసిన పిటిషన్‌గానే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క‌రోనాపై పోరు.. డాబ‌ర్ గ్రూప్ విరాళం

విధుల్లో చేరేందుకు నో చెప్పిన మాజీ ఐఏఎస్‌

వైద్య‌ సిబ్బందికి రెట్టింపు వేత‌నం: సీఎం

మాస్క్‌ లేకుంటే నో పెట్రోల్‌...

మే 1 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

సినిమా

పాడినందుకు పైసా ఇవ్వ‌రు: ప్ర‌ముఖ‌ సింగ‌ర్‌

రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు

'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు'

‘నా భర్త దగ్గర ఆ రహస్యం దాచాను’