పిటిషన్‌ వేయడానికి మీరెవరు.. సుప్రీం ఆగ్రహం

8 Jul, 2019 21:52 IST|Sakshi

హిందూ మహాసభ  దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ: ముస్లిం మహిళలను మసీదులోకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అఖిల భారత హిందూ మహాసభ కేరళ విభాగం అధ్యక్షుడు దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ముస్లిం మహిళల తరుఫున పిటిషన్‌ను దాఖలు చేయడానికి మీరెవరని ఘాటుగా ప్రశ్నించింది. వారకి అన్యాయం జరగుతుందని భావిస్తే.. వారే స్వయంగా కోర్టు దృష్టికి తీసుకువస్తారని అప్పుడు ఖచ్చితంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. పిటిషన్‌ దాఖలు చేయడానికి మీకు ఎలాంటి అర్హత లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. వ్యక్తిగత ప్రచారం కోసమే పిటిషన్‌ వేశారని.. దీనిలో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది.

భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ముస్లిం మహిళలను కోల్పోతున్నారని.. అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా వారిని కూడా మసీదులోకి అనుమతించాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దానిని స్వీకరించేందుకు ఎలాంటి మేరిట్‌ లేదని కోర్టు తోసిపుచ్చింది. కాగా గతంలో కేరళ హైకోర్టు కూడా పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని సుప్రీం ప్రస్తావిస్తూ.. దిగువ కోర్టు ఎందుకు కొట్టివేసిందో తెలుసుకోవాలని సూచించింది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా