అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ : కేంద్రానికి సుప్రీం నోటీసులు

25 Jan, 2019 11:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణాల్లో పేదలకు పదిశాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు మూడువారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈబీసీ రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ వ్యాపారవేత్త తెహసిన్‌ పూనావాలా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

రిజర్వేషన్‌ల కోసం వెనుకబాటుతనాన్ని కేవలం ఆర్థిక ప్రాతిపదికనే పరిగణనలోకి తీసుకోలేమని చెబుతూ ఈ బిల్లును కొట్టివేయాల్సిందిగా పిటిషనర్‌ న్యాయస్ధానాన్ని కోరారు. జనరల్‌ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్‌ కల్పించడం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన 50 శాతం రిజర్వేషన్‌లను మించిపోయిందని పిటిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ  ఈనెల 8, 9 తేదీల్లో పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో ఇది చట్ట రూపం దాల్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు