సుప్రీంలో చిదంబరానికి ఎదురుదెబ్బ

5 Sep, 2019 11:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మనీల్యాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్‌ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. కాగా చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం ఆయన రెగ్యులర్‌ బెయిల్‌ కోసం స్వేచ్ఛగా ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు