‘శబరిమల’పై తీర్పు రిజర్వు

2 Aug, 2018 03:16 IST|Sakshi

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ బుధవారం ముగిసింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలోనే తీర్పును ప్రకటిస్తామని  ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల లాయర్లు రాతపూర్వక వాదనలను సేకరించి వారంలోగా తమ ముందు ఉంచాలని ఆదేశించింది. చివరి రోజు విచారణలో కేరళ ప్రభుత్వం తరఫు లాయర్‌ జయ్‌దీప్‌ గుప్తా వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్యనున్న మహిళలు రాకుండా నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు