వాట్సాప్‌లో విద్యార్థినులపై అశ్లీల సంభాషణ

18 Dec, 2019 15:54 IST|Sakshi

ముంబై: విద్యార్థినులు, మహిళలపై అసభ్యకరమైన పోస్ట్‌లు, లైంగికపరమైన కామెంట్లు చేయటం సోషల్‌ మీడియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మంబైలోని ఓ ఇంటర్నేషల్‌ స్కూల్‌ విద్యార్థులు తమ వాట్సాప్‌ గ్రూప్‌లో.. తమతోపాటు చదివే తోటి విద్యార్థినులను ఉద్దేశించి అశ్లీల పదజాలంతో సంభాషణలు సాగించారు. ఈ విషయం పిల్లల తల్లిదండ్రుల కంటపడగా వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థులంతా 13 నుంచి 14 ఏళ్ల వయస్సు కలవారు కావడం గమనార్హం. అదే విధంగా ఈ విద్యార్థులు ఆయా రంగాల్లో పేరుపొందిన ప్రముఖుల పిల్లలుగా తెలుస్తోంది.

విద్యార్థుల వాట్సాప్‌ సందేశాలు పరిశీలించగా అవన్నీ ఒక కోడ్‌ భాషలో ఉన్నాయి. ‘విద్యార్థినులపై అత్యాచారం చేయాలి.. వారిని ఎలా హింసించాలి’ అని అర్థం వచ్చేవిధంగా వాట్సాప్‌ గ్రూప్‌లో సంభాషణ కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదిక పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నటుడు రోహిత్‌ రాయ్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘సమాజం అసలు ఎటుపోతుంది. ఒక తండ్రిగా నా పిల్లల పట్ల ఒకింత భయంగా ఉంద’ని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు