ఫేస్బుక్లో అసభ్య ఫొటో.. విద్యార్థిని ఆత్మహత్య

26 Jun, 2014 12:16 IST|Sakshi
ఫేస్బుక్లో అసభ్య ఫొటో.. విద్యార్థిని ఆత్మహత్య

ఫేస్బుక్ పేజీలో తన ఫొటోను మార్ఫింగ్ చేసి, అసభ్య ఫొటోను అప్లోడ్ చేయడంతో అవమానభారం తట్టుకోలేని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ విద్యార్థిని తనకు ఆన్లైన్లో పరిచయం అయిన ఫైజల్ ఇమ్రాన్ ఖాన్ అనే స్నేహితుడు తన ఫొటోను మార్ఫింగ్ చేసి, అసభ్య ఫొటోను ఫేస్బుక్లోకి అప్లోడ్ చేయడం చూసింది.

ఆ ఫొటోతో పాటు.. అతడు ఆమె ఫోన్ నెంబర్లను కూడా ఇచ్చాడు. దాంతో మొత్తం జరిగిన సంఘటన అంతటినీ వివరిస్తూ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఖాన్తో పాటు అతడి స్నేహితులు దీపక్, సతీష్ అనే ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు