స్కూల్స్‌ పునఃప్రారంభానికి కసరత్తు

25 May, 2020 18:40 IST|Sakshi

తొలుత గ్రీన్‌, ఆరెంజ్‌ జోన‍్లతో షురూ

సాక్షి, న్యూఢిల్లీ : సుదీర్ఘ లాక్‌డౌన్‌లతో స్కూల్స్‌ ఎప్పుడు తెరుచుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతుండగా జులై నుంచి స్కూళ్లను దశలవారీగా పున:ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తొలుత గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో స్కూళ్లను తెరిపించి హైస్కూల్‌ విద్యార్ధులనే అనుమతించాలని, ప్రాథమిక తరగతుల విద్యార్ధులను తదుపరి దశలో స్కూళ్లకు అనుమతించాలని భావిస్తున్నారు. స్కూళ్లలో 30 శాతం మందే హాజరయ్యేలా రెండు షిఫ్ట్‌లలో పనిచేసేలా నిబంధనలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడతారు.

దేశవ్యాప్తంగా స్కూళ్ల పున:ప్రారంభానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను వచ్చేవారంలో కేంద్ర ప్రభుత్వం జారీచేయనుంది. కాగా కేవలం 30 శాతం హాజరుతోనే పాఠశాలలు పనిచేస్తాయని మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఇటీవల ఉపాధ్యాయులతో జరిగిన వెబినార్‌లో పేర్కొన్నారు. ఇక కాలేజీలు, యూనివర్సిటీల పునఃప్రారంభానికి అవసరమైన భద్రతా పరమైన మార్గదర్శకాలను యూజీసీ వెల్లడిస్తుందని ఇదే వెబినార్‌లో మంత్రి స్పష్టం చేశారు.

చదవండి: ఏపీలో ఆగస్టు 3నుంచి స్కూల్స్ ప్రారంభం

>
మరిన్ని వార్తలు