శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ముందంజ

26 Nov, 2014 01:05 IST|Sakshi
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ముందంజ

‘కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
 
బెంగళూరు: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతితో కామన్‌వెల్త్ దేశాల్లోనే పటిష్ట దేశంగా భారత్ ఎదుగుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళయాన్ ఉపగ్రహ విజయంతో భారత్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొందన్నారు. కామన్‌వెల్త్ దేశాల మొదటి ‘సైన్స్ కాన్ఫరెన్స్’ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ ఆవరణలో మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

భారత్‌లో అందుబాటులోకి వ చ్చిన డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలనే మార్చేసిందన్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, ఇంటర్నెట్ వినియోగంలో సైతం చైనా, అమెరికాల తర్వాత అత్యధిక మంది భారత్‌లోనే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు