ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’

14 Apr, 2018 03:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ‘మౌలికంగా తప్పని’ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు ప్రజల్లో హింసకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు నిబంధనల్ని నిర్వీర్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజల మధ్య హింసను ప్రేరేపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధిక శాతం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్ని కోర్టు వెలువరించాల్సి ఉంది. అంతేకానీ సమాజంలో హింసను పురికొల్పకూడదు’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు