సీట్లు లేవని.. విమానంలోంచి దించేశారు!

26 May, 2018 08:57 IST|Sakshi
ఎయిర్‌ ఇండియా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : బస్సులు, రైళ్లల్లో సీటు లేక బెర్త్‌ రిజర్వేషన్‌ చేయించుకోకపోతే దూరపు ప్రయాణం చేసేవారికి కష్టం. కొన్నిసార్లు సీట్లు లేవన్న కారణంగా కొన్ని ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ప్రయాణికులను ఎక్కించుకోరు. కానీ విమానంలో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. సీట్లు లేవు మీరు దిగిపోండి అంటూ ఎయిర్‌ ఇండియా సిబ్బంది కొందరు ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేశారు. 

ఆ వివరాలిలా.. ఢిల్లీ నుంచి రాజ్‌కోట్‌కు ఇక్కడి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానం ఏఐ-495 బయలుదేరాల్సి ఉంది. అయితే చెకింగ్‌ పూర్తయ్యాక ప్రయాణీకులు ఎయిర్‌ ఇండియా ఎక్కారు. సీట్ల మోతాదుకు మించి ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది వారిని విమానం నుంచి కిందకి దించారు. పొరపాటున 10 శాతం సీట్లు అదనంగా బుక్‌ అయ్యాయని, ఆ ప్రయాణీకులను తర్వాత విమానంలో తరలించినట్లు ఎయిర్‌ ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చుకున్నారు. 

ఎయిర్‌ ఇండియా తప్పిదం చేస్తే తమను విమానం నుంచి దింపి వేయడం ఏంటని ప్రయాణీకులు నిలదీయగా యాజమాన్యం ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. బస్సులు, రైళ్లల్లోనే కాదు విమానాల్లోనూ ప్రయాణీకులను సీట్లు లేవని దింపి వేస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు