అయోధ్యలో 144 సెక్షన్‌

14 Oct, 2019 03:34 IST|Sakshi

అయోధ్య: త్వరలో ‘రామ మందిరం– బాబ్రీమసీదు’ కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో సెక్షన్‌ 144ని విధించారు. ఇది డిసెంబర్‌ 10 వరకు అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్ట్‌ 6వ తేదీ నుంచి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో వాదనలు 17వ తేదీతో ముగియనున్నా యి. సెక్షన్‌ 144 అమల్లో ఉన్న సమయంలో నలుగురికి మించి ఒకే చోట గుమికూడరాదు.

మరిన్ని వార్తలు