దంతెవాడలో హోరాహోరీ కాల్పులు

28 Jul, 2019 13:50 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కట్టెకళ్యాన్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆదివారం నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమచారం అందడంతో ప్రత్యేక బలగాలతో అటవీ ప్రాంతాన్ని మోహరించారు. ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో వారిద్దరి మధ్య  హోరాహోరీ ఎదురుకాల్పుల చోటుచేసుకున్నాయి. ఈ విషాయాన్ని కట్టెకళ్యాన్‌ ఎస్పీ సూరజ్‌ సిన్హా ధృవీకరించారు. కాగా వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు