నేటితో ముగియనున్న కుంభమేళా..

4 Mar, 2019 09:18 IST|Sakshi

ప్రయాగరాజ్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కుంభమేళాకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో సోమవారం చివరి రోజు మహాశివరాత్రి కావడంతో దాదాపు 400 మంది కేంద్ర పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. కుంభమేళాలో ఈ ఒక్కరోజు 60 లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు.

భారీస్ధాయిలో వచ్చే యాత్రికుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా మేజిస్ర్టేట్‌ విజయ్‌ కిరణ్‌ ఆనంద్‌ వెల్లడించారు. పొరుగు జిల్లాలైన కౌశంబి, ప్రతాప్‌గఢ్‌, ఫతేపూర్‌ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా నేటితో ముగియనుంది. ప్రయాగరాజ్‌లో కుంభమేళా ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకు మహాకుంభమేళాను యాత్రికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

మరిన్ని వార్తలు