సురక్షితంగా దీపావళి జరుపుకోండి

2 Nov, 2013 20:50 IST|Sakshi
సురక్షితంగా దీపావళి జరుపుకోండి

హైదరాబాద్: మన దేశంలో మతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు ఇంటిల్లపాది అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి భావిస్తారు. అమావస్య రోజైనప్పటికీ అంతటా దీపాల వెలుగులు, బాణాసంచా  పేలుళ్లు, వెలుగుల పువ్వులు విరజిమ్మే మతాబులు, తారాజువ్వలు, కాకరపువ్వొత్తులు ...... అంతా సందడే సందడి. జీవితంలో  మధురానుభూతులను నింపే పండుగ. అటువంటి దీపావళి పండుగను అందరూ ఆనందంగా, సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవడానికి అగ్నిమాపక అధికారులు, వైద్యులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. వారి సలహాలను పాటిస్తే  పండుగపూట ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు. క్షేమంగా పండుగ జరుపుకోవచ్చు.

అగ్నిమాపక అధికారులు, డాక్టర్ రాఘవ సునీల్, రంగారెడ్డి జిల్లా కంటి వైద్యాధికారి డాక్టర్ మాన్సింగ్ ముందు జాగ్రత్త చర్యలు, సలహాలు ఈ దిగువ ఇస్తున్నాం.

1. బాణాసంచా కాల్చే సమయంలో మహిళలు పట్టు చీరలు కట్టుకోకూడదు. అందరూ కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి.
2. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు బాణాసంచా కాల్చాలి. పిల్లలను ఒంటరిగా వదిలివేయకూడదు.
3. నీళ్ల బక్కెట్టు, ఒక దుప్పటి  సమీపంలో పెట్టుకోవాలి.
4.పేలని టపాసులను వదిలివేయాలి.
5. అవకాశం ఉన్నమేరకు ఖాళీ ప్రదేశంలోనే బాణాసంచా కాల్చాలి.

మరిన్ని వార్తలు