సరస్వతీ దేవి నిన్ను వదిలిపెట్టదు..

1 Dec, 2019 12:42 IST|Sakshi

అమెరికన్‌ పాప్‌ సింగర్‌ సెలెనా గోమెజ్‌ తాను చేసిన పొరపాటుకు విమర్శలపాలైంది. సెలెనా తాజాగా ప్రఖ్యాత స్పోర్ట్స్‌ కంపెనీ ‘పూమా’ వాణిజ్య ప్రకటనలో కనిపించింది. ఇందులో పూమా కంపెనీకి చెందిన స్పోర్ట్స్‌ దుస్తులు ధరించి మంచి ఔట్‌ఫిట్‌తో కనిపించింది. చుట్టూరా పుస్తకాలున్న లైబ్రరీలో ఫొటోలు దిగిన సెరెనా పనిలో పనిగా పుస్తకాల దొంతరలపైనా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ చర్యే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. జ్ఞానాన్ని అందించే పుస్తకాలపై నిలబడటాన్ని పలువురు తీవ్రంగా దుయ్యబట్టారు.

‘భారతీయ సంస్కృతిలో పుస్తకాలకు ప్రత్యేక గౌరవం ఉంది. వాటిని కళ్లకద్దుకుని పూజిస్తారే తప్పితే కాలికిందేసి అవమానించరు’.. ‘తనకు వేరే ప్రదేశమే దొరకలేదా? ఎందుకు ఆ పుస్తకాలపై నిల్చుంది’.. ‘నువ్వు చేసిన తప్పుకు సరస్వతీ దేవీ నిన్ను వదిలిపెట్టదు.. తప్పుకుండా శిక్షించి తీరుతుంది’ అంటూ నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పుస్తకాలు జ్ఞాన సంపదలని, వాటిని అగౌరవపర్చవద్దని మరో నెటిజన్‌ వేడుకున్నాడు. ప్రస్తుతం సెలెనా పూమా యాడ్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా