కరోనా వస్తే.. కనిపెట్టేస్తుంది

9 May, 2020 07:49 IST|Sakshi

ఢిల్లీ : చూడ్డానికి స్టీరియో బాక్సుల్లో ఉండే స్పీకర్‌లాగా కనిపిస్తోంది కదూ.. నిజానికిదో సెన్సర్‌.. దీనికో స్పెషాలిటీ ఉంది.. ఇది కరోనా వాసన పసిగట్టేస్తుందట. వీటిని కాలిఫోర్నియాకు చెందిన కొనికుతో కలిసి ఏరోనాటిక్‌ దిగ్గజం ఎయిర్‌బస్‌ రూపొందిస్తోంది. వీటిని ‘వాసన పసిగట్టే కెమెరాలు’గా పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ సెన్సర్లను విమానాల్లో ప్రమాదకర రసాయనాలు లేదా బాంబులు పెడితే.. వాటిని పసిగట్టడం కోసం తయారుచేశారు.

అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బాంబులకన్నా.. కరోనా బాంబు ప్రమాదకరంగా మారింది కదా.. దీంతో వీటిని కరోనా వైరస్‌ను కనిపెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో బయలాజికల్‌ సెల్స్‌ తో చేసిన మైక్రోప్రాసెసర్లు ఉంటాయి.. వాటి ద్వారా సెన్సర్లు గాల్లో ఉండే రసాయనాలను, సూక్ష్మజీవులను పసిగడతాయి. వెంటనే అలారంను మోగిస్తాయి.. ఇదంతా చేయడానికి ఇవి తీసుకునే సమయం జస్ట్‌ 10 సెకన్లే అట. మానవ శరీరం విడుదల చేసే కణాల్లో కరోనా వైరస్ కొన్ని మార్పులు చేస్తుంది.. ఆ మార్పును ఇది పసిగడుతుందట. గతంలో ఇలాంటి టెక్నాలజీని కేన్సర్‌ను కనిపెట్టే విషయంలో వాడారు. ఇప్పటికే ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఎయిర్‌బస్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివర్లో ఎయిర్‌పోర్టు స్క్రీనింగ్‌ దగ్గర వీటిని వాడతామని.. అనంతరం విమానాల్లో ప్రవేశపెడతామని చెప్పాయి.   
(ధారవిలో ఆగని వైరస్‌ కేసులు)

మరిన్ని వార్తలు