వేర్పాటువాద నేత మస్రత్ ఆలం అరెస్టు

17 Apr, 2015 10:46 IST|Sakshi

శ్రీనగర్:  వేర్పాటువాద నేత మస్రత్ అలంను కశ్మీర్  ప్రభుత్వం శుక్రవారం  మరోసారి అరెస్టు చేసింది. శ్రీనగర్లో ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సందర్భంగా జరిగిన ర్యాలీలో మస్రత్ అలం పాక్ జెండాను ఊపుతూ, ఆ దేశానికి అనుకూలంగా నినాదాలుచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం  కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో  ఆలం  అరెస్టుకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం అలంను అదుపులోకి  తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు   ఇలాంటి వ్యక్తుల పట్ల  ఎలా వ్యవహరించాలో తమకు బాగా తెలుసనీ, ఉపేక్షించే ప్రశ్నే లేదని, పరిస్థితిని కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు.

కాగా సైన్యం అదుపులో ఉన్న యువకుని మరణానికి నిరసనగా శుక్రవారం ర్యాలీకి సన్నద్దమవుతున్నారనే వార్తలతో గురువారం అలం, సయ్యద్ అలీషా గిలానీలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఇటీవల  వేర్పాటువాద నేత మస్రత్  జైలు నుంచి విడుదలైనపుడు భారీ ర్యాలీతో  స్వాగతం  చెప్పారు. ఈ ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శిస్తూ..  పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేయడంతో వివాదం రగిలిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఆధ్వర్యంలో  మస్రత్ అలీ విడుదలపై గుర్రుగా ఉన్నబీజేపీ ఈర్యాలీ ఉదంతంపై మరింత  మండిపడింది.

మరిన్ని వార్తలు