కేరళ సెంట్రల్‌ వర్సిటీ చాన్స్‌లర్‌గా శేషగిరిరావు

6 Jul, 2018 02:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా బీజేపీ సీనియర్‌ నేత ప్రొఫెసర్‌ ఎస్‌.వి.శేషగిరిరావును నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ సీనియర్‌ నాయకుడైన శేషగిరిరావు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. బీజేపీకి అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు.

మరిన్ని వార్తలు