వైరల్‌: పొలాల్లో ఏడడుగుల మొసలి

19 Jul, 2020 10:56 IST|Sakshi

అహ్మదాబాద్‌: సాధారణంగా మొసళ్లు నదులు, పెద్ద చెరువుల్లో సంచరిస్తాయి. కానీ, గుజరాత్‌ వడోదరలోని ఓ గ్రామంలో మాత్రం పంట పొలాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా వడోదరాలో కేలన్పూర్ గ్రామంలోని పంట పొలాల్లోకి ఏడు అడుగుల మొసలి కనిపించింది. దాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అదించారు. మొసళ్లను పట్టే ఫారెస్ట్ రెస్క్యూ బృందం కేలన్పూర్‌కు చేరుకొని మొసలిని పట్టుకున్నారు. చాలా శ్రమపడి ఎట్టకేలకు రెస్క్యూ బృందం మొసలిని పట్టుకొని బంధించి గుజరాత్‌ ఆటవీశాఖ ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘మై వడోదరా’ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో‌ ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (బ్రిటన్‌లో మరో జార్జ్‌ ఫ్లాయిడ్‌!)

‘తమ గ్రామంలోని పంట పొలాల్లో మొసలి సంచరిస్తోందని కేలన్పూర్‌ గ్రామస్తులు మాకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిచారు. వెంటనే మేము ఆ ప్రదేశానికి చేరుకొని మొసలిని పట్టుకొని గుజరాత్‌ ఆటవీ శాఖ జంతసంరక్షణ కేంద్రానికి తరలించాము’ అని రెస్క్యూ టీంలోని ఓ వ్యక్తి తెలిపారు. అదే విధంగా ఈ గ్రామంలో మొసలిని పట్టుకోవటం ఇది ఏడోసారి అని చెప్పారు. ఇక జంతువులను పట్టుకునే క్రమంలో జాగ్రత్తలు పాటిస్తాము. తగిన భద్రలు చర్యలు తీసుకుంటాము. మేము జంతువులకు సాయం చేస్తున్నామని వాటికి తెలియదు. అందుకే తమపై దాడి చేయానికి ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు