ఏడుగురు మావోయిస్టుల అరెస్ట్‌..!

24 Sep, 2018 13:40 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో డంపు స్వాధీనం

భారీగా మందుపాతర్లు అమర్చిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌ : అరకు టీడీపీ నేతలపై కాల్పులు జరిగిన 24 గంటలు గడవకముందే మావోయిస్టులు మరో భారీ పేలుళ్లకు సిద్దపడ్డారు. ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన మందుపాతర్లను పోలీసులు భగ్నం చేశారు. అరకు ఘటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టిన బలగాలు మందుపాతర్లను గుర్తించారు. నారాయణపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురు మవోయిస్టులను పొలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా టీడీపీ నేతల హత్య అనంతరం ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మవోయిస్టులు ప్రాబల్య ప్రాంతాల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ దళాల ఆధ్వర్యంలో పోలీసులు జల్లడపడుతున్నారు.

చదవండి : తూర్పుకొండల్లో.. మావోగన్స్‌ ఘాతుకం

మరిన్ని వార్తలు