ఈ ఏడాది ఏడుగురు సుప్రీం జడ్జీలు రిటైర్‌!

25 Feb, 2018 03:17 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న 10 నెలల కాలంలో మొత్తం ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీవిరమణ చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టులు వెల్లడించాయి. ఇప్పటికే ఆరు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ ఉండటంతో పాటు మరో ఏడుగురు జడ్జీలు రిటైర్‌ కానున్న నేపథ్యంలో కోర్టుపై ఒత్తిడి పడనుంది. మార్చి 1న రిటైర్‌ కావాల్సిన జస్టిస్‌ రాయ్‌ కోర్టు సెలవుల కారణంగా శుక్రవారమే తన ఆఖరి పనిదినాన్ని పూర్తి చేశారు. మిగిలిన న్యాయమూర్తుల్లో జస్టిస్‌ రాజేష్‌ అగర్వాల్‌ మే 4న, సీనియర్‌ జడ్జి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ జూన్‌ 22న, జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్‌ జూలై 6న రిటైర్‌కానున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ మిశ్రా అక్టోబర్‌ 2న బాధ్యతల నుంచి తప్పుకోనుండగా, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నవంబర్‌ 29న, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ డిసెంబర్‌ 30న రిటైర్‌ కానున్నారు.   

>
మరిన్ని వార్తలు