చోటా రాజన్‌కు ఏడేళ్ల జైలు

26 Apr, 2017 00:49 IST|Sakshi

న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌కు మంగళవారం శిక్ష ఖరారైంది. రాజన్‌తో పాటు మరో ముగ్గురికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు 15 వేల జరిమానా కూడా విధించింది.

రాజన్‌తో పాటు దీనికి సహకరించిన ముగ్గురు రిటైర్డ్‌ అధికారులు జయశ్రీ దత్తాత్రేయ రహతే, దీప్‌ నట్వర్‌ లాల్‌షా, లలితా లక్ష్మణన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జి వీరేందర్‌ కుమార్‌ గోయల్‌ దోషులుగా నిర్ధారిస్తూ పై శిక్షనే ఖరారు చేశారు. రాజన్‌ తీహార్‌ జైలులో ఉండగా, బెయిల్‌ పై బయట ఉన్న మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ‘దావూద్‌ను పట్టుకోవడానికి, ఉగ్ర వాదాన్ని అణచివేసేందుకు కృషి చేస్తున్న నిఘా సంస్థలకు సాయం చేశా’ అని రాజన్‌ కోర్టుకు విన్నవించాడు. రాజన్‌ చెప్పిన ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది.

మరిన్ని వార్తలు