రెడ్‌ అలర్డ్‌ : కేరళకు వరద ముప్పు

14 Jun, 2018 18:27 IST|Sakshi

తిరువనంతపురం, కేరళ : కేరళకు వరద ముప్పు పొంచివుంది. ఈ మేరకు గురువారం ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఎస్‌డీఎమ్‌ఏ) ఆరు జిల్లాల్లో(కోజికోడ్‌, మలప్పురం, కన్నూర్‌, వేయానాడ్‌, పాలక్కడ్‌) రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల(ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజా)కు ఆరెంజ్‌ అలర్ట్‌లను జారీ చేసింది. భారీ వరదల కారణంగా భూపాతాలు సంభవించే అవకాశం కూడా ఉన్నట్లు ఎస్‌డీఎమ్‌ఏ హెచ్చరించింది.

ఈ నెల 14 నుంచి 18 తేదీల మధ్య 7 నుంచి 24 సెం.మీల వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో జిల్లా విపత్తు నిర్వహణ సంస్థల సిబ్బందిని అలర్ట్‌ చేసినట్లు వివరించింది. కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌ తీరాల్లో జాలర్లను సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కోరింది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ తీరాలపై భారీ అలలు, పెనుగాలులు విరుచుకుపడనున్నాయి.

మరిన్ని వార్తలు