షారూక్‌ ఖాన్‌ ఫాంహౌస్‌ అటాచ్‌

1 Feb, 2018 05:30 IST|Sakshi
బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌

ముంబై: మహారాష్ట్ర అలీబాగ్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ పేరిట ఉన్న ఫాంహౌస్‌ను ఆదాయ పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్‌చేసింది. వ్యవసాయం కోసం అనుమతి తీసుకున్న భూమిలో నిబంధనలు ఉల్లంఘించి విలాసవంతమైన ఫాంహౌస్‌ను నిర్మించారని ఆరోపించింది. షారూక్‌ ఐటీ శాఖకు 90 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే వ్యవహారంలో రాయ్‌గడ్‌ జిల్లా కలెక్టర్‌ కూడా షారూక్‌కు నోటీసులు పంపారు. షారూక్‌ బంధువులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ దెజావు ఫార్మ్స్‌ వ్యవసాయ కార్యకలాపాలకు 19,960 చ.మీ. భూమిని కొనుగోలు చేసింది. కానీ ఆ స్థలంలో పెద్ద భవంతి, ఈత కొలను, హెలిప్యాడ్‌లను నిర్మించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని, అందుకే షారూక్‌కు నోటీసులు పంపామని ఓ అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు