మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్‌

16 Jan, 2019 11:54 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో ఆలయ ప్రవేశాల వివాదం బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. నేటికి కూడా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను కూడా ఆలయంలోకి అనుమతించలేదు అంటున్నారు కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌. అయితే ఇక్కడ శశి థరూర్‌ని అనుమతించనది అయ్యప్ప ఆలయంలోనికి కాదు.. ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి.

వివరాలు.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వదేశి దర్శన్‌’ టూరిజం ప్రాజెక్ట్‌లో భాగంగా ఓ పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించటానికి కేరళకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీతో పాటు శశి థరూర్‌ మరికొందరు కేరళ నాయకులు కూడా వెళ్లారు. అధికారిక పర్యటన అనంతరం మోదీ ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. అయితే అప్పుడు మోదీతో పాటు తనను పద్మనాభ స్వామి ఆలయంలోకి అనుమతించలేంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శశి థరూర్‌. పీఎమ్‌వో కావాలనే తనతో పాటు మరికొందరి పేర్లను తొలగించిందంటూ.. బీజేపీ కుటిల రాజకీయాలకు ఈ సంఘటన సాక్ష్యం అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు