ముందస్తు బెయిల్‌కు శశి థరూర్‌ అప్పీల్‌

3 Jul, 2018 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సునందా పుష్కర్‌ హత్య కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌ ముందస్తు బెయిల్‌ కోసం మంగళవారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు థరూర్‌ను నిందితుడిగా గుర్తిస్తూ జులై ఏడున విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. అయితే తనపై ఆరోపణలు నిరాధారమైనవని, సునందా పుష్కర్‌ మృతితో తనకు సంబంధం లేదని శశి థరూర్‌ వాదిస్తున్నారు.

ఢిల్లీ పోలీసులు సమర్పించిన 3000 పేజీల చార్జిషీట్‌లో సునందా పుష్కర్‌ హత్య కేసులో శశి థరూర్‌ ప్రమేయం ఉందని ఆయనను నిందితుడిగా పేర్కొంటూ థరూర్‌ భార్య పట్ల క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు.

ఈ కేసులో శశి థరూర్‌ ఇంట్లో పనిచేసే నారాయణ్‌ సింగ్‌ కీలక సాక్షిగా మారారు. కాగా 2014, జనవరి 17న సునందా పుష్కర్‌ ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌ గదిలో విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు