శశిథరూర్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం

18 Dec, 2019 18:27 IST|Sakshi

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ నేత శశిథరూర్‌ మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. 2019 సంవత్సారానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను బుధవారం 23 భాషల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌ రాసిన ' యాన్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్: ది బ్రిటీష్‌ ఎంపైర్‌ ఇన్‌ ఇండియా‌' పుస్తకానికి నాన్‌ ఫిక‌్షన్‌ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

భారత్‌పై బ్రిటీష్‌ పాలకుల ప్రభావం గురించి, దేశాన్ని ఎలా నాశనం చేశారనే దానిపై ఈ పుస్తకాన్ని రాశారు. భారత వనరులను బ్రిటన్‌ పాలకులు ఎలా అపహరించారు? మన వస్త్ర, ఉక్కు, షిప్పింగ్‌  పరిశ్రమలను ఎలా నాశనం చేశారనే దానిపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. శశిథరూర్‌ ఈ పుస్తకాన్ని 2016లో విడుదల చేశారు. కాగా సాహిత్య అకాడమీ పురస్కారం కింద ఆయన రూ. లక్ష నగదు బహుమతిని పొందనున్నారు.

రాజకీయాల్లో అపరమేధావిగా పేరు గాంచిన శశిథరూర్‌ లండన్‌లో జన్మించారు.1975లో ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేజన్‌ పూర్తి చేసిన శశిథరూర్‌ 1978 లో అమెరికాలోని టఫ్ట్స్‌ విశ్వవిద్యాలయం నుంచి ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ విభాగంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్‌ పై డాక్టరేట్ పూర్తి చేశారు. మంచి రాజకీయనాయకునిగా పేరు పొందిన శశిథరూర్‌ చాలా పుస్తకాలు రచించారు. అందులో ప్రముఖంగా 'వై ఐయామ్‌ ఎ హిందూ' , 'ది పారాడాక్సికల్‌ ప్రైమ్‌ మినిష్టర్‌' లాంటివి చెప్పుకోదగినవి.

మరిన్ని వార్తలు