‘అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’

3 Mar, 2019 15:45 IST|Sakshi

లక్నో : బీజేపీ నాయకత్వంతో విభేదిస్తున్న ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తాను తిరిగి పట్నా సాహిబ్‌ స్ధానం నుంచే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నిర్ణయంతో నిమిత్తం లేకుండా తాను నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని తెగేసిచెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను పోటీ చేసే నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదన్నారు. 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచి పలు అంశాలపై సిన్హా పార్టీ అగ్రనాయకత్వంతో విభేదిస్తున్న సంగతి తెలిసిందే.

నోట్ల రద్దు, జీఎస్టీ సహా పలు నిర్ణయాలపై సిన్హా సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో జరిగిన బీజేపీ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని స్టార్‌ స్పీకర్‌గా విపక్షాల ప్రశంసలు అందుకున్నారు.మరోవైపు తన భార్య పూనం సిన్హాను యూపీలోని లక్నో నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌పై పోటీకి నిలిపేందుకు శత్రుఘ్న సిన్హా యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోం‍ది.

ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో ఇటీవల లక్నోలో సిన్హా భేటీని ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ధ్రువీకరించని సిన్హా దీన్ని తోసిపుచ్చలేనని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సిన్హా ఎస్పీ టికెట్‌పై పోటీలో ఉంటారని భావిస్తున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాయావతికి ఎదురుదెబ్బ 

అయోధ్య కేసు: సుప్రీంకు కమిటీ నివేదిక

ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

కుమారస్వామి ఉద్వేగం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

58 పురాతన చట్టాల రద్దు

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్‌ షా

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై ఆరా తీయండి

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!